టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఫైట్ హాట్ టాపిక్ గా మారింది. బాక్స్ ఆఫీస్ అసలైన మొగుడు అంటూ కలెక్షన్స్ నెంబర్స్ పోస్టర్స్ తో ఎవరికీ వారు సోషల్ మీడియాలో ప్రచారాల డోస్ పెంచుతున్నారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు ఒకరోజు గ్యాప్ లోనే థియేటర్స్ లోకి వచ్చాయి

అయితే ఈ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో మహేష్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం సరిలేరు నీకెవ్వరు 57లక్షల కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. పరభాషలో డైరెక్ట్ తెలుగు సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం రేర్ ఫీట్ అని చెప్పాలి.

ఇక మలయాళంలో ఇప్పటికే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న మల్లు స్టార్ తమిళనాడులో కూడా మహేష్ కి గట్టి పోటీని ఇస్తున్నాడు. 'అల వైకుంఠపురములో' 40లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు సినిమాలు ఓవర్సీస్ లో కూడా డాలర్ల వర్షం కురిపిస్తున్నాయి.

ఇకపోతే సరిలేరు నీకెవ్వరూ.. నైజాంలోఐదు రోజులకు రూ.22.5 కోట్ల షేర్ ని రాబట్టింది. మరి కొద్దిరోజుల్లో మహేష్ కెరీర్ లో హయ్యెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన 'మహర్షి' సినిమాని దాటేస్తుందని అంటున్నారు. సీడెడ్ లో 9.75 కోట్లు, గుంటూరులో 7.19 కోట్లు, కృష్ణ 5.55 కోట్ల షేర్ వసూలు చేసింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమాపై పెట్టిన ఎనభై శాతం పెట్టుబడి తిరిగొచ్చేసింది.