బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ వెండితెరపై కనిపించి చాలా కాలమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఏడాది వరకు షూటింగ్ లేకుండా ఖాళీగా కనిపిస్తున్నాడు. గత ఏడాది ఇదే సమయానికి జీరో సినిమా ప్రమోషన్స్ తో  హడావుడి చేశాడు. ఆ సినిమా దెబ్బకొట్టడంతో మరో సినిమా ఒప్పుకునేందుకు ఖాన్ చాలా ఆలోచించాడు. ఎలాగైనా నెక్స్ట్ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఎనో కథలపై కసరత్తులు చేశాడు.

ఫైనల్ గా దర్శకుడు అట్లీ చెప్పిన ఒక పాయింట్ కి ఫిదా అయిన షారుక్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. షారుక్ పుట్టినరోజు సందర్బంగా ఇటీవల ఈ కాంబినేషన్ పై స్పెషల్ అప్డేట్ కూడా ఇచ్చారు. టైటిల్ "సంఖి" అని సెట్ చేశారు. అయితే సినిమాకు సంబందించిన షూటింగ్ మాత్రం ఇప్పట్లో స్టార్ట్ కాదట. అసలైతే డిసెంబర్ లోనే రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ అనుకున్నారు.

ఎన్టీఆర్ తో ఇష్టంలేకుండా సినిమా చేశా.. డైరెక్టర్ హాట్ కామెంట్స్!

కానీ దర్శకుడు అట్లీ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాకే షూటింగ్ మొదలెట్టాలని డిసైడ్ అయ్యాడు  షారుక్ కూడా లెట్ అయినా పరవాలేదని అప్పటివరకు సినిమాకు తగ్గట్టుగా ఫిట్ నెస్ లో మార్పులు తేవాలని కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ షారుక్ ప్రాజెక్ట్ ని 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ స్టార్ హీరో రెండు పాత్రల్లో కనిపించే విధంగా దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నట్లు టాక్.

ఇక సినిమా మార్చ్ లో మొదలైతే ఫినిష్ కావడానికి ఏడాది సమయమైనా పడుతుంది. అంటే 2021వరకు వెయిట్ చేయకతప్పదు. మరి ఈ బిగ్ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. ఇటీవల దర్శకుడు అట్లీ నుంచి వచ్చిన బిగిల్ బాక్స్ ఆఫీస్ వద్ద 300కోట్లకు పైగా వసూళ్లను అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. విజయ్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించారు.