ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులుకే డిలీటెడ్ సీన్స్ అంటూ కొన్నింటిని యూట్యూబ్ లో  చూస్తున్నాం. అరే..ఇవి కూడా ఖర్చుపెట్టి,కష్టపడి తీసారే..ఎందుకు తీసేసారు అంటూ ఆలోచనలో పడిపోతాం. కానీ రకరకాల కారణాలతో సీన్స్ ని, ఒక్కోసారి ట్రాక్ లను లేపేస్తూంటారు దర్శక,నిర్మాతలు. అలాంటిదే ..తాజాగా మహేష్ చిత్రం సరిలేరు నీకెవ్వరు కు జరిగిందని సమాచారం. ఈ సినిమాలో కమిడియన్ షకలక శంకర్ మీద తీసిన ట్రాక్ ని తొలిగించారని స్వయంగా నిర్మాతే చెప్తున్నారు. అందుకు మత్తువదలరా హిట్ కొంతవరకూ కారణం అని తెలుస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో షకలక శంకర్ కమెడియన్ గా ఒక మంచి క్యారక్టర్ వేసాడు. సినిమా కథతో సంబంధం లేకుండా ఉండే ఒక సెపరేట్ ట్రాక్ అది. అతని మీద చేసిన కామెడీ కూడా బాగా పండిందట. అయితే సినిమా రన్ టైమ్ కు ఇబ్బందివస్తోందని,అనవసరం అని  షకలక శంకర్ కామెడీ ట్రాక్ మొత్తానికి లేపేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అనిల్ సుంకర రీసెంట్ గా  మీడియా దగ్గర రివీల్ చేసారు.  

చిరు 152 కొత్త లుక్.. సగం వయసు తగ్గిపోయిందిగా!

“కథలో భాగంగా వచ్చే సత్య కామెడీ ట్రాక్ చాలా బాగా వచ్చింది. దాంతో షకలక శంకర్ కామెడీ ట్రాక్ అవసరం లేదని భావించాం. ఆ ట్రాక్ కథకు అసలు సంబంధం ఉండదు” అని నిర్మాత ప్రకటించాడు. రీసెంట్ గా వచ్చిన మత్తు వదలరా చిత్రంలో సత్య కామెడీ ట్రాక్ బాగా పేలటంతో దాన్ని ఈ సినిమాలో  హైలెట్ చేస్తున్నారని తెలుస్తోంది.

అయితే షకలక శంకర్ మీద తీసిన కామెడీ ట్రాక్ మొత్తం లేపేసినా కానీ సరిలేరు నీకెవ్వరు రన్ టైమ్ 2 గంటల 48 నిముషాలు వచ్చినట్లు సమాచారం. దాంతో ఆ ట్రాక్ కూడా కలిపితే మూడు గంటలు దాకా పెరుగుతుందనే తీసేసారని చెప్తున్నారు. అయితే అంత రన్ టైమ్ ఉన్నా కానీ ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీలవ్వరని చెప్తోంది చిత్ర యూనిట్. అలాగే ఈ సినిమాలో అరగంట పాటు వచ్చే ట్రైన్ ఎపిసోడ్ బాగా పేలుతుందని దర్శక,నిర్మాతలు నమ్ముతున్నారు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మండన్న హీరోయిన్ గా నటించగా, లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌,రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు.  దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.