మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారంనుండి మొదలైంది. కోకాపేటలో వేసిన భారీ సెట్ లో సినిమా షూటింగ్ మొదలైంది. కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగానిర్మిస్తున్నారు.

సామాజిక అంశాలతో కూడా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరు పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా సినిమాలో చిరు లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఇందులో చిరుని చూస్తుంటే 'చూడాలనివుంది' సినిమాలో చిరు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడనిపిస్తుంది.

మైక్ లాగేసుకొని చిరుతో గొడవకి దిగిన రాజశేఖర్!

సగానికి సగం వయసు తగ్గిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగిగా కనిపిస్తారని సమాచారం. 'సైరా' సినిమా తరువాత చిరజీవి నటిస్తోన్న సినిమా కావడంతో దర్శకుడు కొరటాల ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.

మొదటిసారి కొరటాల.. చిరుని డైరెక్ట్ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాని ఆగస్ట్ 14న విడుదల చేసేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా కనిపించనుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.