బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ మొత్తానికి యాక్టింగ్ ప్రపంచంలో అడుగుపెట్టింది.అయితే ఆమె సొంత భాషలో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కలరింగ్ ఇచ్చింది. ఒక ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ లో నటించిన సుహానా నటనపరంగా మంచి ప్రశంసలు అందుకుంటోంది.  గతకొనిత కాలంగా బాలీవుడ్ అత్యంత వైరల్ అవుతున్న వార్తలలో సుహానా హాట్ టాపిక్ అవుతోంది.

ఆమె సినీ ఎంట్రీకి సంబందించిన ఎన్నో వార్తలు అభిమానుల్లో కాస్త కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేశాయి. ఆ మధ్య షారుక్ కూతురిని సినిమాల్లోకి రానివ్వడం లేదని టాక్ వచ్చింది. ఆ టాక్ వచ్చినప్పుడే షారుక్ క్లారిటీ ఇచ్చేశాడు. వారి జీవితం వారి ఇష్టం ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నా అడ్డు చెప్పనని కేవలం మంచి సలహాలు మాత్రమే ఇస్తానని షారుక్ వివరణ ఇచ్చాడు. ఇక మొత్తానికి సుహానా ఖాన్ తాన యాక్టింగ్ ని ఒక ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్ ద్వారా బయటపెట్టింది.

గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ అనే ఆ షార్ట్ ఫిల్మ్ ని న్యూ యార్క్ లోప్ చిత్రీకరించారు. ఈ షార్ట్ ఫిల్మ్ పెద్దగా వైరల్ అవ్వలేదు గాని షారుక్ కూతురు మాత్రం తప్పకుండా మంచి నటి అవుతుందని నెటిజన్స్ ప్రసంసలు కురిపిస్తున్నారు. ఫిల్మ్ మేకింగ్ పై కూడా శిక్షణ తీసుకుంటున్న సుహానా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.

 

ఇక షారుక్ పెద్ద కుమారుడైన ఆర్యన్ ఖాన్ కి ఇప్పుడు 21 ఏళ్ళు. అతని ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తన వారసుడి కోసం ఒక మంచి సినిమాని సెట్ చేయాలంటే తాను వేరే పనులు పెట్టుకోకూడదని కింగ్ ఖాన్ డిసైడ్ అయినట్లు అప్పట్లో టాక్ వచ్చింది. అయితే కొడుకు ఎంట్రీకి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పవచ్చు. జీరో సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న షారుక్ ప్రస్తుత అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఈ దర్శకులకు కొండంత ధైర్యం వీళ్లే.. ఆ పేరు పడితే బ్లాక్ బస్టర్ అంతే!