బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దీపావళి సందర్భంగా ముంబైలో తన ఇంట్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు బాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. అంబానీ ఫ్యామిలీ కూడా వచ్చింది. ఐశ్వర్యారాయ్ వద్ద మేనేజర్ గా పని చేసిన అర్చనా సదానంద్ అనే మహిళ కూడా వేడుకకు హాజరైంది.

అయితే లెహంగాకి దీపం అంటుకోవడంతో వెంటనే మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న షారుఖ్ ఆమెని కాపాడినట్లు సమాచారం. ఇంగ్లీష్ డైలీ రాసిన కథనం ప్రకారం.. అర్చన  తన కూతురితో కలిసి గార్డెన్ లోకి వెళ్లిన సమయంలో ఆమె లెహంగా దీపాల మధ్య చిక్కుకుందట.

బిగ్ బాస్ బ్యూటీ.. బోల్డ్ వీడియో వైరల్!

మంటలు అంటుకోవడంతో ఆమె కేకలు వేయడం మొదలుపెట్టిందట. కానీ చుట్టూ ఉన్న వారికి ఏం చేయాలో అర్ధం కాక సైలెంట్ గా ఉండిపోయారట. ఆ సమయంలో అక్కడే ఉన్న షారుఖ్ వెంటనే అప్రమత్తమై తన జాకెట్ తీసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారట.

 

ఆమెని కాపాడే సమయంలో షారుఖ్ కి కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. అనంతరం అర్చనని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించినట్లు తెలుస్తోంది. ఆమెకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉండని డాక్టర్లు తెలిపారు.

అయితే ఈ విషయంపై అమితాబ్ కానీ అతడి కుటుంబసభ్యులు కానీ స్పందించలేదు. ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండడం లేదు. చాలా రోజుల తరువాత  అమితాబ్ తన ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో అర్చన గాయాలపాలవ్వడం బాధాకరం.