బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టంట్ గా పాల్గొన్న భానుశ్రీ గురించి అప్పటివరకు జనాలకు పెద్దగా తెలియదు. కానీ బిగ్ బాస్ షోతో కాస్త పాపులారిటీ సంపాదించుకుంది. హౌస్ లో కౌశల్ తో గొడవ పెట్టుకొని వార్తల్లో నిలిచింది.

మీరు ఉహించని  గెస్ట్ రోల్స్.. యాంకర్స్  డైరెక్టర్స్ షాకిచ్చిన వేళ

హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత ఆమె వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. గతంలో 'కుమారి 21 ఎఫ్', 'ఇద్దరి మధ్యలో 18' వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ ఇటీవల 'ఏడు చేపల కథ' అనే బూతు సినిమాలో నటించింది. ట్రైలర్ లో భానుని చూసిన వారు షాకయ్యారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ 'EMI' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాషూటింగ్ లో భాగంగా ఓ వీడియో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. పువ్వుల మధ్య తన నాభి అందాలను ఆరబోస్తూ స్కిన్ షో చేసింది భాను.

ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ 'నేను మీకు నచ్చకపోయినా పర్లేదు.. అందరికీ మంచి టేస్ట్ ఉండాలని లేదు కదా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తన అందాన్ని గుర్తించని వారు వేస్ట్ అంటూ ముందే కౌంటర్ ఇచ్చేసింది. మరి ఈ రేంజ్ లో రెచ్చిపోతున్న భానుశ్రీకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి!