బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న సినిమాలు ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఒకదానికి మించి మరో సినిమా ఫ్లాప్ అవుతోంది. ఈ క్రమంలో తన పరిస్థితిపై తనే జాలి పడుతున్నాడు షారుఖ్.

ఇలా వరుస ఫ్లాప్ లు వస్తే.. ఇక తనకు సినిమా అవకాశాలు ఉండవేమోనని కొద్దిరోజుల క్రితం షారుఖ్ అన్నారు. ఆ తరువాత కూడా ఈ హీరోకి హిట్టు పడలేదు. 'జీరో' లాంటి భారీ బడ్జెట్ సినిమా షారుఖ్ కి నిరాశే మిగిల్చింది. షారుఖ్ తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నాడు.

మల్టీప్లెక్స్ లో భారీ రేట్లు.. మండిపడ్డ హీరో నిఖిల్!

ఇలాంటి క్రమంలో తన పరిస్థితిపై మరోసారి తనే జాలిని ప్రకటించుకున్నాడు షారుఖ్. 'మేం కథలను ప్రేక్షకులకు నచ్చేలా చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాం' అంటూ షారుఖ్ వ్యాఖ్యానించాడు. తన ఫ్లాప్ లపై ఈ ప్రకటన చేశాడు ఈ హీరో. ఇప్పటివరకు షారుఖ్ తన తదుపరి సినిమాపై ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు.

సరైన దర్శకుడి కోసం షారుఖ్ చూస్తున్నాడని అంటున్నారు. అయితే ఒక సినిమాలో స్పెషల్ రోల్ మాత్రం చేయబోతున్నాడు. చాలా మంది స్టార్ హీరోలు కలిసి నటిస్తోన్న 'బ్రహ్మాస్త్ర' సినిమాలో షారుఖ్ ఓ ప్రత్యేక పాత్రను చేయబోతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.