టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన 'అర్జున్ సురవరం' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా చిత్రబృందం గుంటూర్ కి వెళ్లింది. అక్కడ హీరో నిఖిల్ కి వింత అనుభవం ఎదురైంది.

టీ కోసం ఆగిన ఆయన 'అర్జున్ సురవరం' పైరసీ సీడీలను అమ్మడాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. ఇది ఇలా ఉండగా.. ఒక అభిమాని నుండి నిఖిల్ కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 

టికెట్ రేట్ కన్నా థియేటర్ లో పాప్ కార్న్ రేట్ ఎక్కువగా ఉందని.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఈ విషయాన్ని మర్చిపోతున్నారని..మల్టీప్లెక్స్ లో సినిమా చూడడానికి వెళ్తే.. అరలీటర్ వాటర్ బాటిల్ కి రూ.60 తీసుకుంటున్నారని.. థియేటర్ బయట లీటరు రూ.20 దొరికే బాటిల్ రూ.120 అమ్మడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నించారు. 

సౌత్ ఇండియాలో రామ్ ఒక్కడికే సాధ్యమైన ఘనత!

దీనిపై స్పందించిన నిఖిల్ ఇటీవల తనొక ఫేమస్ థియేటర్ కి వెళ్లానని, అక్కడ డైట్ కోక్ కి రూ.300 తీసుకున్నట్లు.. ఆ ధర చూసి ఆశ్చర్యపోయానని నిఖిల్ అన్నారు. అక్కడ అమ్మే వ్యక్తిని నిలదీసినట్లు.. నిజానికి తప్పు అతనిది కాదని.. మల్టీప్లెక్స్ లు ఆ ధరని నిర్ణయించాయని అన్నారు. ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలు మల్టీప్లెక్స్ లు తప్పనిసరిగా పాటించేలా చూడాలని, ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధర పెట్టకుండా చూడాలంటూ చెప్పుకొచ్చారు.

నానితో కలిసి సినిమా చేసే ఆలోచన ఉందా అని మరో అభిమాని ప్రశ్నించగా.. దానికి నిఖిల్ 'నేను రెడీనే నానినే చెప్పాలి' అని బదులిచ్చాడు. 'అర్జున్ సురవరం' సినిమాని థియేటర్ లోనే చూడాలని పైరసీని ప్రోత్సహించవద్దని ఈ సందర్భంగా అభిమానులను కోరారు.