సీనియర్ నటి జమీలా మాలిక్ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం నాడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె కేరళ పాలోడ్ లో తన కుమారుడు అన్సార్ తో కలిసి ఉండేవారు.

కొల్లాంలో జన్మించిన జమీలా.. తల్లి ప్రోద్బలంతో పూనే ఫిల్మ్ అండ్ టెలివిజన్ లో స్టూడెంట్ గా చేరారు. అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి కేరళ మహిళగా నిలిచారు. ఆ తరువాత 1972లో 'ఆద్యతే కథ' అనే సినిమాతో జమీలా సినీ రంగ ప్రవేశం చేశారు.

స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చేసిన హీరోయిన్!

ఆ తరువాత పలు మలయాళం, తమిళ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తరువాత ఆమె సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టారు. పలు హిందీ సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. దివంగత జయలితతో కూడా కలిసి నటించారు.

అయితే 1983లో వివాహం చేసుకున్న ఆమె ఆ తరువాత భర్తతో విడిపోయారు. ప్రస్తుతం కొడుకుతో కలిసి జీవిస్తున్నారు. ఆమె మరణ వార్త విన్న సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.