సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటాడు. తన సినిమాల ముహూర్తపు సన్నివేశాలకు హాజరుకాడు. ఇక మూడు అక్షరాలతో వచ్చిన టైటిల్స్ ఎక్కువ హిట్ అవ్వడంతో.. అలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు.

ఇక తన సినిమాకి చెందిన ప్రతీ అంశాన్ని తనకు కలిసొచ్చిన '9 నెంబర్ తో ముడిపదేలా చూసుకుంటాడు. వీటితో పాటు మహేష్ కి మరో క్రేజీ సెంటిమెంట్ కూడా ఉంది. ఆయన లుంగీలో కనిపించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 'పోకిరి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' ఈ మూడు చిత్రాల్లో మహేష్ లుంగీతో కనిపించే సీన్లు ఉంటాయి.

పాపం.. మహేష్... హిట్ టాక్ రాగానే.. ఫట్ అంటూ ట్రోల్స్

ఊహించని విధంగా ఈ మూడు కూడా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. ఒక్కసారి మహేష్ పంచె గానీ, లుంగీ కానీ కట్టుకొని థియేటర్స్ లో కనిపిస్తే ఇక మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తుంటాయి. తాజాగా మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాలో కూడా మహేష్ బాబు లుంగీలో కనిపించి ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. 'మైండ్ బ్లాక్' సాంగ్ తో పాటు చాలా సీన్స్ లో మహేష్ లుంగీతో రచ్చ చేశాడు. ఈ సినిమాకి కూడా ఆడియన్స్ ని పాజిటివ్ టాక్ వస్తుంది. ఈ రెండు రోజుల్లో సినిమా భారీ వసూళ్లను సాధిస్తుందని నమ్ముతున్నారు. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.