Asianet News TeluguAsianet News Telugu

ఆ తండ్రీకొడుకులకు నా సినిమా అంకితం : రామ్ గోపాల్ వర్మ

జనసేనకి మనసేనకి సంబంధం లేదని మీడియా మీద ఒట్టేసి చెప్పారు వర్మ. తన కెరీర్ లో తొలిసారి సందేశాత్మక చిత్రం  తీశానని.. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంటుందని అన్నారు. తన సినిమాలకు కోర్టులకు వెళ్లడం కామన్ అయిపోయిందని వెటకారంగా చెప్పారు. 

Sensational Director Ram Gopal Varma Interesting Comments
Author
Hyderabad, First Published Nov 27, 2019, 3:25 PM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన వర్మ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. సినిమాలో పవన్ కళ్యాణ్ ని పోలిన ఓ పాత్ర, ఆ పాత్ర పెట్టే 'మనసేన' అనే పార్టీ ఉంటుందని అన్నారు.

జనసేనకి మనసేనకి సంబంధం లేదని మీడియా మీద ఒట్టేసి చెప్పారు వర్మ. తన కెరీర్ లో తొలిసారి సందేశాత్మక చిత్రం  తీశానని.. ఈ సినిమాలో మంచి మెసేజ్ ఉంటుందని అన్నారు. తన సినిమాలకు కోర్టులకు వెళ్లడం కామన్ అయిపోయిందని వెటకారంగా చెప్పారు.

ఫ్లాఫ్ అయినా మీసం తిప్పుతూ, నిర్మాతకు కండీషన్స్!

2019 నుండి 2020 మధ్యకాలంలో జరిగిన కథనే ఊహించి ఈ సినిమా చేశామని అన్నారు. సినిమాలో బాలకృష్ణ పాత్ర లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో తను ఏ కులాన్ని తక్కువ చేయలేదని అన్నారు. గతంలో జరిగినవి సినిమాలుగా తీశానని.. ఇప్పుడు జరుగుతుందని భావించిన విషయాలను సినిమాగా తీశానని అన్నారు.

ఇదొక పొలిటికల్ సెటైర్ మాత్రమేనని అన్నారు. సినిమాలో ఉన్న పాత్రలు అన్నీ కల్పితమని అన్నారు. కానీ ఆ పాత్రలకు నిజ జీవిత పాత్రలకు మధ్య పోలికలు ఉంటే మాత్రం యాదృచ్చికమని అన్నారు. 'పప్పు' సీన్ ట్రైలర్ లో చూసి చాలా మంది తెలుగుదేశం నాయకులే తనకు ఫోన్ చేసి అభినందించారని అన్నారు.

ఈ సినిమాని ఎవరికి అంకితమిస్తారని వర్మని ప్రశ్నించగా.. 'ఇద్దరు ప్రఖ్యాతి గాంచిన తండ్రీకొడుకులకు ఈ సినిమా అంకితమని.. వారి పేర్లను మాత్రం అడగొద్దని' చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు వింధు భోజనంలా ఉంటుందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios