సినిమా ఇండస్ట్రీలో వారసత్వాన్ని అందుకోవడానికి అబ్బాయిలే కాదు.. అమ్మయిలు కూడా ముందుంటున్నారు. ప్రస్తుతం మరో సీనియర్  హీరో కూతురు కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తోంది. యాక్షన్ కింగ్ గా ఒకప్పుడు తనదైన శైలిలో సినిమాలు చేసి సౌత్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసిన అర్జున్ కూతురు ఐశ్వర్య ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోవడానికి సిద్ధమైంది.

ఇప్పటికే తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య ఇంతవరకు తెలుగులో నటించలేదు. ఆ మధ్య ఆఫర్స్ వచ్చినప్పటికీ సరైన ఛాన్స్ వచ్చే వరకు రిస్క్ చేయవద్దని బేబీ కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసిందట. ఇక ఇప్పుడు సొంతంగా తండ్రి అర్జున్ తెరకెక్కించబోయే ఒక సినిమా ద్వారా ఐశ్యర్య తెలుగు తెరకు పరిచయం కాబోతోందట.

అర్జున్ తన సొంత ప్రొడక్షన్ లోనే ఆ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్ గా బిజీ అవుతున్న తరుణంలో మళ్ళీ అర్జున్ డైరెక్షన్ లోకి యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. వీలైనంత త్వరగా సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చు హీరోయిన్ కి తెలుగులో మంచి హిట్ ఇవ్వాలని అర్జున్ ప్రణాళికలు రచిస్తున్నాడు. మరీ ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

RRR హీరోను టార్గెట్ చేసిన మహేష్ డైరెక్టర్?