మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ బిగ్ మల్టీస్టారర్ లో అల్లూరి సీతారామరాజు గా చరణ్ కనిపించబోతున్నాడు. మరో కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ అలరించబోతున్నాడు. ఆ సినిమా ఈ ఏడాది సమ్మర్ ఎండింగ్ లో విడుదల కాబోతోంది.

ఇకపోతే ప్రస్తతం రామ్ చరణ్ మరో దర్శకుడితో కొత్త సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు. వరుసగా బాక్స్ ఆఫీస్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్స్ తో సమానంగా క్రేజ్ అందుకుంటున్న అనిల్  రావిపూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాను డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి నెక్స్ట్ రామ్ చరణ్ తో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

డైరెక్టర్ తో లేచిపోయిన నటి.. తల్లి ఆత్మహత్యాయత్నం!

మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' ఈ నెల 11న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా హిట్టయితే అనిల్ రావిపూడి రేంజ్  మరో స్థాయికి చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రామ్ చరణ్ కూడా  ఈ యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే మెగాస్టార్ సినిమాలో కూడా రామ్ చరణ్ నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ 152 సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మరో స్టార్ హీరో అవసరమని దర్శకుడు చరణ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.