ప్రముఖ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు తన సినిమాల్లో హీరోయిన్లను చాలా అందంగా చూపిస్తుంటారు. అప్పట్లో హీరోయిన్లంతా కూడా ఒక్కసారైనా రాఘవేంద్రరావు సినిమాలో నటించాలని కోరుకునేవారు. అంతగా ఆయనకి క్రేజ్ ఉండేది. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరమైనా అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటారు.

తాజాగా మరోసారి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. హీరో నాని నిర్మాతగా మారి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశ్వక్ సేన్ హీరోగా 'హిట్' అనే సినిమాని నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

యాంకర్ సుమ సంపాదనపై రాజీవ్ కనకాల కామెంట్స్!

రాజమౌళి, అనుష్క, రానా లాంటి సెలబ్రిటీలతో పాటు సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా వచ్చారు. స్టేజ్ పై మాట్లాడడానికి వెళ్లిన ఆయన్ని యాంకర్ సుమ.. ''మీ సినిమాల్లో హీరోయిన్లు కనిపించేంత అందంగా వేరే సినిమాల్లో కనిపించరు ఎందుకని..?'' అని అడిగింది.

దానికి ఆయన.. ''ఏ హీరోయిన్నైనా చూసినప్పుడు అమ్మాయి ఫేస్ చూడను.. అమ్మాయి షేప్ ఎలా ఉంది.. లోపాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తా.. లోపాలను కవర్ చేస్తూ అందంగా చూపించడానికి ప్రయత్నిస్తా.. పదేళ్ల క్రితం రాజమౌళి ఈ ప్రశ్న అడిగితే ఇదే ఆన్సర్ చెప్పా..'' అంటూ హీరోయిన్ల షేపుల గురించి మాట్లాడి షాకిచ్చారు.

దీనికి సుమ.. ''సర్ నా ఫేస్ వంకే చూశారు.. నేను అదృష్టవంతురాలిని'' అంటూ సెటైర్ వేసి అందరినీ నవ్వించింది.