టాలీవుడ్ లో యాంకర్ సుమ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీవీ షోలు, ఈవెంట్స్ అంటూ బిజీగా గడుపుతుంది. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె ఆల్ టైం ఫేవరేట్ అనే చెప్పాలి. అంతగా తన మాటలతో మెస్మరైజ్ చేస్తుంటుంది. స్టార్ హీరోల ఈవెంట్స్ అంటే సుమ ఉండాల్సిందే.

అన్నీ తానై ఈవెంట్ ని రక్తి కట్టిస్తుంది. చిన్న సినిమా ఫంక్షన్లను కూడా పక్కన పెట్టకుండా తనకు సమయం దొరికితే అన్ని ఈవెంట్స్ చేస్తుంటుంది. అయితే సుమ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒక్కో ఈవెంట్ కి రెండు నుండి ఐదు లక్షలు తీసుకుంటుందని మీడియా వర్గాల టాక్.

భర్తకి విడాకులిచ్చి.. బికినీలో రెచ్చిపోతోన్న 'కొత్తబంగారు లోకం' పిల్ల!

కానీ ఎంత తీసుకుంటుందనే విషయంలో క్లారిటీ లేదు. సుమ కూడా తన రెమ్యునరేషన్ గురించి బయట పెద్దగా మాట్లాడదు. అయితే తన భార్య రెమ్యునరేషన్ పై రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ రెమ్యునరేషన్ గురించి సీరియస్ కామెంట్స్ చేశారు.

సుమ ఆడియో ఫంక్షన్లకు, ప్రీరిలీజ్ ఈవెంట్ లకు ఎన్ని లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందో తనకైతే తెలియదని.. మీడియా వాళ్లు అంత ఇంత అంటుంటారు కానీ.. తనకు మాత్రం సుమ రెమ్యునరేషన్ తెలియదని అన్నారు.

ఇంట్లో లావాదేవీలు చూసే అలవాటు తనకు లేదని.. సుమకి సంబంధించిన ఆర్ధిక లావాదేవీలను అసలు పట్టించుకోనని అన్నారు. సుమ స్పేస్ లోకి వెళ్లి తన సంపాదన మీద పెత్తనం చెలాయించే నేచర్ తనది కాదని చెప్పారు.