Asianet News TeluguAsianet News Telugu

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. రోజాతో కలిసి మొక్కలు నాటిన కుష్బూ!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ గారు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు ఈ సందర్భంలో రోజా వనం ఫౌండర్ రోజా గారు మరియు గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు పాల్గొన్నారు.

senior actress kushboo comments on green india challenge
Author
Hyderabad, First Published Feb 29, 2020, 5:43 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ నటి ఖుష్బూ గారు మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ సందర్భంలో రోజా వనం ఫౌండర్ రోజా గారు మరియు గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుష్బూ గారు మాట్లాడుతూ 'పర్యావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్న రోజా గారిని , ఎంపీ సంతోష్ గారిని కుష్బూ గారు ప్రత్యేకంగా అభినందించారు. మానవ మనుగడకు అతి ముఖ్యమైనవి.. ఆహారం, దుస్తులు, నివాసం. వీటితోపాటు ప్రాణ వాయువు ఆక్సిజన్ కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయి.

అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. వీటిని మనం ఎంత విరివిగా పెంచితే అంత మంచిది'.  ఈ సందర్భంగా రోజా గారు మాట్లాడుతూ 10 నిమిషాలు ఆక్సిజన్ ఇచ్చే డాక్టర్ ని దేవుడు అంటాం , మనకు జీవితం మొత్తం ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను జాగ్రత్తగా , బాధ్యత గా పెంచాలి. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ తన అమూల్యమైన సమయాన్నీ ప్రజల శ్రేయస్సు కోసం, వారికి అవగాహన కల్పించాలని ఆమె గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న కుష్బూ గారిని , సహకారాన్ని అందించిన రోజా గారిని ప్రత్యేకంగా అభినందించారు.

డైరెక్టర్ తో కలిసి మొక్కలు నాటిన కీర్తి సురేష్!

Follow Us:
Download App:
  • android
  • ios