రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో మొక్కలు నాటిన ప్రముఖ సినిమా హీరోయిన్ కీర్తి సురేష్.

ప్రస్తుతం ఈమె దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న 'రంగ్ దే' సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. షూటింగ్ సమయంలోనే తన దర్శకుడు వెంకీతో కలిసి మొక్కలు నాటింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నట్లు చెప్పారు .

పెళ్లి వయసు దాటేశారు... ఇక లైఫంతా సింగిల్ బతుకేనా?

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమం పొల్యూషన్ పెరుగుతున్న ఈ సమయంలో ఈ కార్యక్రమంలో  అందరూ పాల్గొని చెట్లను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొ ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.