యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఫ్యాన్స్ అందరూ కలిసి 'తారక్ టీం ట్రస్ట్ ఛారిటీ' అనే సంస్థను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఫ్యాన్స్ అంతా కలిసి పేదలకు అన్నదానాలు చేయడం, వృద్ధులకు సహాయం చేయడం, అనారోగ్య సమస్యలున్న వారికి చికిత్సలు చేయించడం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు చలపతిరావు.. తారక్ ఫ్యాన్స్ చేస్తోన్న మంచి పనిని ఉద్దేశిస్తూ తనకు చాలా సంతోషంగా ఉందని.. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ తారక్ పేరు మీద టీం గా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటివరకు 33 ఈవెంట్ చేశారంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

సుడిగాలి సుధీర్ సినిమాకి రూ.5 కోట్లు.. అంత సీన్ ఉందా..?

అభిమానులు చేస్తోన్న ఈ కార్యక్రమాలతో తారక్ జన్మధన్యమైందని అన్నారు. ఆర్టిస్ట్ అవ్వడం గొప్ప కాదు. ఆ ఆర్టిస్ట్ పేరుతో ఇన్ని సేవా కార్యక్రమాలు చేసే ఫ్యాన్స్ ఉండటం గొప్ప అంటూ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎవరికీ భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పెద్ద ఎన్టీఆర్ గారని.. ఆయన ఎవ్వరికీ భయపడలేదని.. ఆయన అడుగుజాడల్లో మేం నడుస్తున్నామని అన్నారు.

ఈ తరానికి పెద్దన్న జూనియర్ ఎన్టీఆర్ రూపంలో వచ్చారని.. తారక్ చాలా ధైర్యవంతుడని.. ఎవరెన్ని ఫోన్లు చేసి బెదిరించినా.. తారక్ మాత్రం భయపడడని చెప్పారు. తారక్ అభిమానులు కూడా అంతేనని.. ఎవరికీ భయపడరని, తారక్ ఎంత గట్టోడో వీళ్ళు కూడా అంతేనని చెప్పారు.