మంచి కాఫీలాంటి సినిమాల క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్లో ఓ  చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఫిధా' తో తెలుగులో పేరు తెచ్చుకున్న  సాయి పల్లవి చైతు సరసన నటిస్తోంది.  మ్యూజికల్ లవ్ స్టొరీ గా తెర మీద ఆవిష్కరించబోతున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ కి ‘లవ్ స్టోరీ’ అనే పేరును ఖరారు చేసి పోస్టర్ వదిలారు శేఖర్ కమ్ముల. హీరో,హీరోయిన్స్ కలసి ఉన్న పోస్టర్ కి చాలా మంచి రెస్సాన్స్ వస్తోంది. ప్రేమలో కనిపించే భావోద్వేగాలను పోస్టర్ లో పలికించాడు శేఖర్ కమ్ముల అని అందరూ మెచ్చుకుంటున్నారు.  

ఈ నేపధ్యంలో  ఈ చిత్రం క్లైమాక్స్ గురించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తిరుగుతోంది.అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా క్లైమాక్స్ ...టైటానిక్ ని పోలి ఉంటుందని తెలుస్తోంది. టైటానిక్ కథ తరహాలోనే హీరో చివర్లో చనిపోతాడని, ఆ జ్ఞాపకాలతోనే ఆమె జీవితం గడుపుతుందని తెలుస్తోంది.

'అల.. వైకుంఠపురములో'.. 'సిత్తరాలా సిరపడు' సాంగ్ వచ్చేసింది!

స్టోరీ లైన్ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వూలో శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. శేఖర్ కమ్ముల చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ కూడా రూరల్ తెలంగాణా నుంచి సిటీకు పెద్ద పెద్ద కలలు,కోరికలతో వస్తారు. వాటిని నెరవేర్చుకునే క్రమంలో వాళ్లిద్దరూ చాలా ఇబ్బందులు,కష్టాలు పడతారు.

ఆ జర్నీలోనే వీళ్దిద్దరూ కలవటం జరుగుతుంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ తమను తాము ప్రపంచం ముందు ఎలా ఆవిష్కరించుకున్నారనే యాంగిల్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. వీరిద్దరూ తెలంగాణా స్లాంగ్ లోనే మాట్లాడతారు. ఇది కొన్ని జీవితాలను కొత్త కోణంలో చూపిస్తుంది. తెలుగు తెరపై ఇలాంటి కథ చూడలేదు. నేటి యూత్ జీవితానికి బాగా దగ్గరగా ఉండే సినిమా ఇది. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ పాత్రలు ప్రేక్షకులకు బాగా పడతాయని చెప్తున్నారు.

నాగ్ చైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ లుక్.. టైటిల్ ఫిక్స్
 
సునిశితమైన భావోద్వేగాలను బలంగా తెరమీద పలికించగల విజనరీ ఉన్న శేఖర్ కమ్ముల అందించబోతున్న ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ట్:రాజీవ్ నాయర్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి కుమార్, సహా నిర్మాత : విజయ్ భాస్కర్, పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా, డిజిటల్ మార్కెటింగ్: నీహారిక గాజుల,మ్యూజిక్ : పవన్, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు, రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల