నందమూరి బాలకృష్ణ మరికొద్ది రోజుల్లో 'రూలర్' చిత్రంతో ప్రేక్షకులని అలరించబోతున్నాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. రూలర్ తర్వాత నందమూరి అభిమానులు పండగ చేసుకునే కాంబినేషన్ రెడీ అవుతోంది. 

బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. మిర్యాల రవీంద్ర నిర్మించనున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కబోతున్నట్లు లేటెస్ట్ టాక్. బాలయ్య, బోయపాటి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

ఈ అంచనాలు అందుకునేందుకు ఏ అంశంలోనూ తగ్గకుండా చిత్రాన్ని రూపొందించాలని బోయపాటి భావిస్తున్నారు. దీనికోసం ఏఈ చిత్రానికి దాదాపు 70 కోట్ల బడ్జెట్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమాకు 70 కోట్లు కేటాయించనుండడం టాలీవుడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

'RRR'కు షాక్.. కొమరం భీం వీడియో లీక్.. ఎన్టీఆర్ ఎలా ఉన్నాడంటే..

త్వరలో రిలీజ్ కాబోతున్న రూలర్ మూవీ బిజినెస్ అంతంత మాత్రంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రూలర్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ రూ 15 కోట్ల లోటుతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో బాలయ్య, బోయపాటి చిత్రానికి 70 కోట్ల బడ్జెట్ చాలా పెద్ద రిస్క్ అని అంటున్నారు.