యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. రాజమౌళి తన సినిమాల ప్రణాళిక, షూటింగ్ విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకుల బెడద తప్పడం లేదు. 

ఆమె మధ్యన షూటింగ్ లొకేషన్స్ నుంచి బ్రిటిష్ కాలం నాటి పోలీస్ స్టేషన్ ఫోటోలు, మరికొన్ని లొకేషన్ పిక్స్ లీక్ అయ్యాయి. నటీనటుల దృశ్యాలు లీక్ కాకపోవడంతో అప్పట్లో వాటిని చిత్ర యూనిట్ లైట్ తీసుకుంది. 

తాజాగా ఆర్ఆర్ఆర్ టీంకు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ విశాఖ జిల్లా మన్యం ప్రాంతంలో జరుగుతోంది. ఎన్టీఆర్, రాంచరణ్ పై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ లొకేషన్ నుంచి ఎన్టీఆర్ కొమరం భీం లుక్ లో ఉన్న వీడియో లీకైంది. 

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఇంతటి భారీ చిత్రం నుంచి వీడియో లీక్ కావడం ఏంటని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ వీడియోను, ఎన్టీఆర్ లుక్ ని ఆన్లైన్ లో లీక్ చేస్తున్న వారిపై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దీనితో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ వేగంగా స్పందించి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. కాపీ రైట్ యాక్ట్ ద్వారా ఆన్లైన్ లో సర్కులేట్ అవుతున్న ఎన్టీఆర్ వీడియోల్ని చిత్ర యూనిట్ తొలగిస్తుంది. 

'అల వైకుంఠపురములో' టీజర్.. 'నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా'.. బన్నీ స్టైలిష్ ట్రీట్!

ఇక కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ లుక్ ఆసక్తికరంగా ఉంది.తలపై ఎర్రటి తలపాగా ధరించి ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. గుబురుగా ఉన్న గడ్డంతో ఎన్టీఆర్ లుక్ ఆసక్తికరంగా ఉంది. వారం రోజుల పాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ వైజాగ్ లో జరగనుంది. రాంచరణ్ కు హీరోయిన్ గా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడిగా ఫారెన్ బ్యూటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. హాలీవుడ్ నటి అలిసన్ డూడి, నటుడు రే స్టీవెన్సన్ విలన్లుగా నటిస్తున్నారు.