టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద వార్ చూసి చాలా కాలమవుతోంది. నెక్స్ట్ ఇయర్ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు ఒకరోజు గ్యాప్ లో యుద్దానికి సిద్ధమయ్యాయి. "అల..వైకుంఠపురములో.." - సరిలేరు నీకెవ్వరు సినిమాలపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తప్పకుండా రెండు సినిమాలు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అవుతాయని చెప్పవచ్చు.

 

ఓ వైపు మహేష్ బాబు - మరోవైపు అల్లు అర్జున్.. ఫ్యాన్ బేస్ విషయంలో మహేష్ ఒక మెట్టు పైనే ఉన్నప్పటికీ బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ కాబట్టి స్టైలిష్ స్టార్ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద ఈక్వల్ గా పోటీని ఇచ్చే అడ్వాంటేజ్ ఉంది. గతంలో జులాయి - S/o సత్యమూర్తి సినిమాలతో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న ఈ కాంబో మూడవసారి కూడా స్ట్రాంగ్ సక్సెస్ అందుకునే అవకాశం ఉంది.  ఇక మరోవైపు మహేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి సరిలేరు నీకెవ్వరుపై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి.

'ప్రతిరోజూ పండగే' మూడు రోజుల కలెక్షన్స్ !

అయితే ఈ యుద్ధంలో మరో చిన్న సినిమా కూడా పోటీని ఇవ్వడానికి సిద్ధమైంది. కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంత మంచి వాడవురా సినిమా జనవరి 15న రిలీజ్ కాబోతోంది. దర్శకుడు ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నాడు. గతంలో సతీష్ డైరెక్ట్ చేసిన శతమానం భవతి సినిమా ఇలాంటి పోటీలోనే సంక్రాంతి హిట్ గా నిలిచింది.  ఇప్పుడు కూడా అలాంటి హిట్ దక్కుతుందని దర్శకుడు గట్టిగా చెబుతున్నాడు.

వేరే సినిమాలతో తమకు ఏ మాత్రం పోటీ లేదని చెబుతూ.. పండగ సమయంలో తప్పకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా తమ సినిమాని ఆదరిస్తారని సతీష్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. దీంతో "ఎంత మంచి వాడవురా!" కూడా సంక్రాంతి ఫైట్ లో కీలకంగా మారనుందని అర్ధమవుతోంది. "అల..వైకుంఠపురములో.." జనవరి 12న రిలీజ్ అవుతుండగా - సరిలేరు నీకెవ్వరు దానికంటే ఒకరోజు ముందే రాబోతోంది. మరి ఈ బిగ్ ఫైట్ లో ఏ హీరో బిగ్ హిట్ అందుకుంటాడో చూడాలి.