సంక్రాంతికి దూసుకువస్తున్న అల్లు అర్జున్ , త్రివిక్రమ్ చిత్రం అల వైకుంఠ పురములో ...ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు రెండూ సూపర్ హిట్ అయ్యి చాట్ బస్టర్స్ గా మారాయి. అదే సంక్రాంతికి రాబోతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రమోషన్స్ పరంగా వెనకబడింది.  

దాంతో సరిలేరు నీకెవ్వరూ టీమ్ బాగా ఒత్తిడికి లోనైనట్లుంది. ఏదో ఒకటి సోషల్ మీడియాలోకి వదిలి బజ్ క్రియేట్ చేయాలనుకున్నారు. అయితే ఆ ప్రయత్నం నిరర్దకమైంది. దాంతో మహేష్ బాబు టీమ్ పై సీరియస్ అయ్యినట్లు సమాచారం. బయిటకు వెళ్తున్న ప్రమోషన్ ఐటం లు సరిగ్గా చూసుకోవాలని, లేకపోతే సినిమాపై నెగిటివ్ ప్రచారం వచ్చే అవకాశం ఉందని దర్శకుడుని హెచ్చరించినట్లు సమాచారం.

వర్మకి చిరంజీవి వార్నింగ్ ఇచ్చారా..?

వివరాల్లోకి వెళితే... దర్శకుడు అనీల్ రావిపూడి రీసెంట్ గా విడుదల దీపావళి కానుకగా ఓ ఫన్నీ వీడియోను విడుదల చేసారు. మహేష్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేద్దామనుకున్న ఈ  ప్రయత్నం పెద్ద హిట్ అయ్యి వైరల్ అవుతుందనుకున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ ...మహేష్ కు సంబంధించిన వీడియో కోసం ఎదురుచూస్తారు కానీ మరే ఏ కామెడీలు చేస్తే వాళ్లకు నచ్చవు అనే విషయం మర్చిపోయినట్లున్నారు.

దాంతో వెన్నెల కిషోర్, సుబ్బరాజులతో కలిసి రూపొందించిన వీడియో అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. ఈ వీడియోకు అపీషియల్ యూట్యూబ్ ఎక్కౌంట్ లో పాతివ వేల వ్యూస్ కూడా రాలేదు. అక్కడే అర్దం చేసుకోవాలి ఈ వీడియో ఎంత డిజాస్టర్ అయ్యిందో.
 
ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మహేశ్‌ సైనిక అధికారి అజయ్‌ కృష్ణగా కనిపించనున్నారు. రష్మిక హీరోయిన్ . అలనాటి తార విజయశాంతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషించనున్నారు.  

యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో.. జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో కొన్ని ముఖ్య పాత్రలలో రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని  వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.