బయోపిక్ ల పేరిట చాలా మంది ప్రముఖులను టార్గెట్ చేస్తోన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మెగాఫ్యామిలీని టార్గెట్ చేశాడు. నిన్న సాయంత్రం 'మెగా ఫ్యామిలీ' అనే సినిమా తీస్తానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చిన వర్మ ఈరోజుకి మాట మార్చేశాడు.

మెగాఫ్యామిలీలో హీరోకి ముప్పై తొమ్మిది మంది పిల్లలు ఉంటారని, తనకి పిల్లల సినిమా తీయడం రాదు గనుక సినిమా చేయదలచుకోలేదని చెప్పాడు. అయితే మెగాఫ్యామిలీ అనగానే చిరంజీవి అలర్ట్ అయి ఉంటారనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కారణం లేకుండా తమపై ఎవరైనా బురద చల్లాలని చూస్తే చిరంజీవి అంత తేలికగా తీసుకోరు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే .. గెస్ట్ ఎవరంటే..?

రాజకీయ పరమైన విమర్శలను పట్టించుకోరేమో కానీ వ్యక్తిగత విషయాలపై ఎటాక్ చేస్తే మాత్రం చిరంజీవి సైలెంట్ గా ఉండరు. వర్మ ఇలా సినిమా అనౌన్స్ చేశాడని తెలియగానే దాన్ని ఆరంభంలోనే ఆపాలని భావించిన చిరు నేరుగా రంగంలో దిగారని టాక్. ఆ కారణంగానే వర్మ అనౌన్స్ చేసిన మరుసటి రోజుకే మాట మార్చేశాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో వర్మ తీసే సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

దీంతో జనాలు తనను పట్టించుకోవడం కోసం వార్ల ఇలాంటి పనులు చేస్తున్నాడని అర్ధమవుతోంది. ప్రస్తుతం వర్మ 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా  కోసం కూడా వివాదాస్పద కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఏపీ సమకాలీన రాజకీయ నేపధ్యంలో సాగుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలచేశారు. అది కాస్త సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది.