సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా తొలిరోజు నుండే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతుంది. మహేష్ ని మాస్ అవతారంలో చూసిన ఫ్యాన్స్ అతడి లుక్ కి ఫిదా అయిపోతున్నారు.

'అల.. వైకుంఠపురములో'.. ఆ ఇల్లు ఎవరిదో తెలుసా..?

థియేటర్లలో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. నైజాంలో ఈ సినిమా ఐదు రోజులకు రూ.22.5 కోట్ల షేర్ ని రాబట్టింది. మరి కొద్దిరోజుల్లో మహేష్ కెరీర్ లో హయ్యెస్ట్ నైజాం కలెక్షన్స్ సాధించిన 'మహర్షి' సినిమాని దాటేస్తుందని అంటున్నారు. సీడెడ్ లో 9.75 కోట్లు, గుంటూరులో 7.19 కోట్లు, కృష్ణ 5.55 కోట్ల షేర్ వసూలు చేసింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ సినిమాపై పెట్టిన ఎనభై శాతం పెట్టుబడి తిరిగొచ్చేసింది. 

ప్రాంతాల వారీగా ఏపీ/తెలంగాణా కలెక్షన్స్ వివరాలు…
నైజాం.............. 22.5 కోట్లు
సీడెడ్................ 9.75 కోట్లు
ఉత్తరాంధ్ర..........10.05 కోట్లు
గుంటూరు............ 7.19 కోట్లు
ఈస్ట్.................... 6.22 కోట్లు
వెస్ట్.....................4.54 కోట్లు
కృష్ణ....................5.55 కోట్లు
నెల్లూరు...............2.42 కోట్లు

మొత్తంగా ఐదు రోజులకు గాను ఈ సినిమా రూ. 68.22 కోట్ల షేర్ ని రాబట్టింది.