సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా రష్మిక హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.

'సరిలేరు నీకెవ్వరు' రివ్యూ!

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సంక్రాంతి కానుకగా తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మహేష్ అభిమానులు ఈ సినిమా కోసం థియేటర్ల వద్ద ఎగబడుతున్నారు. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు.

ఇక థియేటర్లలో ఈలలు, గోలలతో హోరెత్తిస్తున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'మైండ్ బ్లాక్' సాంగ్ కి సంబంధించిన చిన్న వీడియోలు కూడా బయటకి వచ్చాయి. 'బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కి బ్యాండే' అంటూ డైలాగ్ లు రాస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.