మహేష్ బాబు నటిస్తున్న కామెడీ అండ్ యాక్షన్ ఎనర్టైనర్ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ ఈ సినిమాలో సరికొత్త కామెడి టైమింగ్ తో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాల డోస్ పెరిగింది.

అదే సమయానికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రెండు సినిమాల్లో ఏ సినిమా క్లిక్కవుతుంది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ డల్ గా సాగుతున్నాయి అనే కామెంట్స్ కి చిత్ర యూనిట్ కౌంటర్ ఇచ్చే విధంగా ప్రమోషన్ డోస్ పెంచడానికి సిద్ధమవుతోంది.

దీపావళి రోజు ప్రమోషన్ రేంజ్ పెరిగేవిధంగా స్పెషల్ బిలాస్ ప్లాన్ చేసింది.  ఇటీవల విలన్ హౌజ్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసినట్లు చెప్పిన దర్శకుడు అనిల్ రావిపూడి ఫైనల్ షెడ్యూల్ ని కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టనున్నట్లు ఎనౌన్స్ చేశాడు. అలాగే దీపావళికి  ఒక ట్రీట్ సెట్ చేసినట్లు కూడా చెప్పాడు. దీంతో సినిమాపై స్పెషల్ ఎట్రాక్షన్ నెలకొంది. అనిల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సరిలేరు నీకెవ్వరు! మహేష్ హై ఓల్టేజ్ లుక్