దసరా మూమెంట్ లో ప్రతి ఒక్కరు వారి సినిమాలకు సంబందించిన పోస్టర్స్ తో తెగ హడావుడి చేస్తున్నారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ముందే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

ఇక ఇప్పుడు మరో పోస్టర్ తో మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది.  రాక్షససంహారణతో విజయదశమిని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి అంటూ మహేష్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశాడు. చేతిలో గొడ్డలి పట్టుకొని కొండారెడ్డి బురుజు వద్ద అదిరిపోయే స్టిల్ ఇచ్చాడు. పోస్టర్ తోనే హీటేక్కిస్తున్న మహేష్ సినిమాలో ఇంకెంతగా ఎట్రాక్ట్ చేస్తాడో చూడాలి. 16 సంవత్సరాల క్రితం ఈ కట్టడం (కొండారెడ్డి బురుజు) సిల్వర్ స్క్రీన్ మీద రికార్డును క్రియేట్ చేసింది.

ఇప్పుడు అదే కట్టడం వద్ద మరో హిట్ కోసం సిద్ధమవుతున్నారు.  ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గ ఈ కట్టడాన్ని అద్భుతంగా రూపొందించారు.  కర్నూల్ కొండారెడ్డి బురుజును ఆయన ఫిలిం సిటీకి తీసుకొచ్చారు.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు రామ్ బ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. . ఇందులో ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.