ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అస్వస్థత గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 1.30 సమయంలో ఆమె ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందని గ్రహించిన బంధువులు  వెంటనే  ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కి తరలించారు.

గత కొన్ని రోజులుగా ఆమెకి శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అది కాస్త ఇప్పుడు  సీరియస్ అయిందని సమాచారం. ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 28తో 90వ ఏట అడుగుపెట్టారు లతా మంగేష్కర్.

ఆ నిర్మాతే నా బ్యాక్ బోన్, హీరోయిన్ గా ఛాన్స్ వస్తే.. యాంకర్ శ్యామల కామెంట్స్!

ఈ సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ధర్మేంద్ర, హేమామాలిని, మాధురీ దీక్షిత్, ఏఆర్ రెహ్మాన్, శ్రేయా గోశల్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఆమెకి సోషల్ మీడియా వేదికగా ఆమెకి విషెస్ చెప్పారు. ఒక్క హిందీలోనే వెయ్యికి పైగా పాటలు పాడిన ఆమె భారత రత్న అవార్డు సొంతం చేసుకున్నారు.

అలానే 2001లో ది హయ్యెస్ట్ సివిలియన్ హానర్ అనే అవార్డుని దక్కించుకున్నారు. నవంబర్ 10ఆదివారం నాడు లతా మంగేష్కర్ తన ట్విట్టర్ లో తన మేనకోడలు పద్మిని ,నటించిన 'పానిపట్' సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ ఆమెకి విషెస్ చెప్పారు. ఇంతలో ఆమె ఆనారోగ్యం పాలవ్వడంతో కుటుంబసభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.