హీరోయిన్లంటే గ్లామర్ షో మామూలే.. వారి ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి వెండితెరపై ఎక్స్పోజ్ చేయడం, క్లీవేజ్ షో లాంటివి చేస్తుంటారు. అయితే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ నిజజీవితంలో తన తమ్ముడితో కలిసి బికినీ ఫోజులివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కొద్దిరోజుల క్రితం సారా మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్లింది. ఆ సమయంలో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. తాజాగా తన తమ్ముడి ఇబ్రహీం అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా మాల్దీవ్స్ లో తన తమ్ముడితో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ అతడికి విషెస్ చెప్పింది.

బన్నీ-స్నేహల ప్రేమ బంధానికి తొమ్మిదేళ్లు!

ఈ ఫోటోలలో సారా బికినీ వేసుకొని ఉండడంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సోదరుడితో కలిసి అలాంటి ఫోటోలు దిగడానికి సిగ్గుగా లేదా..? అంటూ ఆమెని టార్గెట్ చేస్తున్నారు. సారా ముస్లిం కావడంతో ఆ మతానికి చెందిన వారు ఇదొక పాపం అంటూ ఆమెపై మండిపడుతున్నారు.

అయితే సారా అభిమానులు మాత్రం ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. అక్క, తమ్ముడి బంధాన్ని తప్పుగా చూడడానికి సిగ్గు లేదా అంటూ కామెంట్స్ చేస్తోన్న వాళ్ల నోళ్లుమూయిస్తున్నారు. 2020లో కూడా ఇలానే ఉండాలంటూ నియమాలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. కెరీర్ లో రెండు సినిమాలే చేసిన సారాకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.