మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. మొదట  ప్రేమకథా చిత్రాల్లో నటించిన బన్నీ.. ఆ తరవాత యాక్షన్ సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా నిలదొక్కుకున్నాడు.

సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే బన్నీ.. కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు. ఈరోజుతో బన్నీ, స్నేహల పెళ్లి జరిగి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

పెళ్లి రోజు ఫోటోని షేర్ చేస్తూ.. ''రోజులు వేగంగా గ‌డుస్తున్నాయి. ప్రేమ అంత‌కంత పెరుగుతుంద‌ని'' పేర్కొన్నాడు. బ‌న్నీకి నెటిజ‌న్స్ శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిది ప్రేమవివాహం.

ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని అమ్మాయి స్నేహా రెడ్డి. ఇబ్రహీంపట్నంలో బీటెక్ చదివిన స్నేహారెడ్డి.. అమెరికాలో ఎమ్మెస్ చేశారు. వ్యాపారవేత్త, విద్యాసంస్థల అధినేత కేపీఎస్ రెడ్డి కుమార్తె ఈమె. కులాలకు అతీతంగా వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవ‌ల 'అల వైకుంఠ‌పుర‌ములో' చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Arjun (@alluarjunonline) on Mar 5, 2020 at 6:13pm PST