ప్రతీ దర్శకుడు తనకంటూ ఓ ఐడెంటెటీ కోరుకుంటారు. అదే సమయంలో కొన్ని నియమాలు, ఎథిక్స్ ని ఫాలో అవుతూంటారు. వాటిని ఎంతో తప్పనిసరి పరిస్దితి వస్తే తప్ప దాటటానికి ఇష్టపడరు. ముఖ్యంగా యువతరం, ఫామ్ లో ఉన్నవాళ్లు అయితే తాము గీసుకున్న గీతకు కట్టుబడి ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి కూడా స్కూల్ లో ప్రయాణం పెట్టుకున్నారంటున్నారు. తన వద్దకు వచ్చిన ఆఫర్ ఎంత టెమ్టింగ్ గా ఉన్నా...వద్దని చెప్పేసారట. అందుకు కారణం...ఆ సబ్జెక్ట్ లు సెక్స్ కంటెంట్ ఎక్కువైపోవటమే అంటున్నారు.

విశాల్ 'యాక్షన్' మూవీ ప్రీరిలీజ్ బిజినెస్.. హిట్ కావాలంటే..
 
గత కొంతకాలంగా హిందీలో సక్సెస్ అయిన లస్ట్ స్టోరీలను తెలుగులో  చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సందీప్ రెడ్డి వంగాను సైతం ఎప్రోచ్ అయ్యారు నిర్మాతలు. అయితే ఆ వెబ్ సీరిస్ లో సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం తెలిసినా తనకు పరువు హత్య కథతో వెబ్ సీరీస్ చేయాలని చెప్టంతో ఓకే అనుకున్నారట.

తన టీమ్ తో కలిసి కథ తయారు చేసారు సందీప్ వంగా. అయితే ఆయన సబ్ మిట్ చేసిన స్క్రిప్టులో కంటెంట్..హిందీ వెబ్ సీరిస్ స్దాయిలో లేదని, వాళ్ళు రిపేర్లు పేరుతో తమ కంటెంట్ రైటర్స్ తో సెక్స్ కంటెంట్ డోస్ ని పెంచేసారట. అది చదివిన సందీప్ వంగ షాక్ అయ్యారట.

ఇలాంటి వెబ్ సీరిస్ నేను డైరక్ట్ చేస్తే పూర్తిగా ఓ అడల్ట్ డైరక్టర్ అనే ముద్ర నాకు తెలుగులో పడిపోతుంది. హిందీ వేరు..తెలుగు వేరు అని వాదించారట. అయినా సరే వాళ్ళు ఏక్సెప్ట్ చేయలేదట.  అలా చేయడం తనకు ఇష్టంలేదని.. అందుకే నో చెప్పేసారట. ఈ విషయం ఓ ఆంగ్ల పత్రికతో తెలిపారు సందీప్ రెడ్డి. అసలు తనకు లస్ట్, సెక్స్ అనే కాన్సెప్ట్‌లపై సినిమాకానీ, వెబ్ సీరిస్ గాని ఆసక్తి లేదని తేల్చేసాడు.

 లస్ట్ స్టోరీస్ హిందీలో సూపర్ హిట్టైన వెబ్ సిరీస్.  అందులో  హాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కియారా అద్వానీ, భూమి ఫడ్నేకర్ లాంటి స్టార్స్ కొంచెం రెచ్చిపోయి ఇందులో నటించారు.  వాళ్ల అందాలే పెట్టుబడిగా,కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేసి ఈ సిరీస్ అంత పెద్ద సెస్సేషన్ క్రియేట్ అయ్యేలా చేసాయి. ఇప్పుడు లస్ట్ స్టోరీస్ తెలుగు వర్షన్ రాబోతుంది. దీనికి తెలుగులో తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి లాంటి దర్శకులు పని చేయబోతున్నారు.