తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు విశాల్. విశాల్ కు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. పందెం కోడి చిత్రం విశాల్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత విశాల్ మాస్ ప్రేక్షకులని మెప్పించేలా అనేక చిత్రాలు చేశాడు. 

విశాల్ తాజాగా నటించిన చిత్రం యాక్షన్. పేరుకు తగ్గట్లుగానే హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. నవంబర్ 15న తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు యాక్షన్ చిత్రం సిద్ధం అవుతోంది. సుందర్ సి ఈ చిత్రానికి దర్శకుడు. 

తాజా సమాచారం మేరకు విశాల్ మార్కెట్ కు తగ్గట్లుగా తెలుగులో యాక్షన్ చిత్రానికి మంచి ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో యాక్షన్ మూవీ హక్కులు 7.5 కోట్లకు అమ్ముడయ్యాయి. యాక్షన్ తెలుగు రైట్స్ రూపంలో నిర్మాతలు మంచి ధరనే అందుకున్నారు. 

తమన్నా లిప్ లాక్ సీన్.. నా రూల్ మారదంటున్న మిల్కీ బ్యూటీ!

ట్రిడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై రవీంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కువగా విదేశాల్లో యాక్షన్ చిత్రాన్ని చిత్రీకరించారు. యాక్షన్ తెలుగులో హిట్ కావాలంటే 8 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది. చివరగా విశాల్ అభిమన్యుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. 

ఆ చిత్రానికి తెలుగులో 4.5 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగగా 9 కోట్లకు పైగా వసూలు చేసి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. హిట్ టాక్ వస్తే యాక్షన్ మూవీ కూడానా బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. విశాల్ తమన్నా ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడి యాక్షన్ స్టంట్స్ చేశారు. హాలీవుడ్ హీరోయిన్లకు తగ్గకుండా తాను ఈ చిత్రంలో పెర్ఫామ్ చేశానని తమన్నా తెలిపింది.