బాలయ్యకు ఇటీవల సరైన సక్సెస్ లేదు. దీనితో బాలయ్య తనకు అచ్చొచ్చిన  క్రేజీ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో మూడోసారి జతకట్టాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. వీళ్లిద్దరి హ్యాట్రిక్ కాంబో ఇటీవల ప్రారంభమైంది.  

ఈ చిత్రంలో బాలయ్య రెండు గెటప్పుల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన హాట్ బ్యూటీ సమీరా రెడ్డి ఈ చిత్రంలో నటించబోతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. 

స్పైడర్ మ్యాన్ కు భిక్షగాడి సాయం.. విధి విచిత్రం

సమీరా రెడ్డి గతంలో ఎన్టీఆర్ సరసన అశోక్, నరసింహుడు చిత్రాల్లో రొమాన్స్ చేసింది. పెళ్లయ్యాక సమీరా రెడ్డి సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం సమీరా భార్యగా, తల్లిగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. బోయపాటి ఇటీవల సమీరాకు కథ వినిపించగా ఆమె సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా మరో సంచలన నటి కూడా బాలయ్య చిత్రంలో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరో కీలక పాత్ర కోసం బోయపాటి సంచలన నటి తనుశ్రీ దత్తని సంప్రదించినట్లు టాక్. తనుశ్రీ దత్తా బాలయ్యతో కలసి వీర భద్ర చిత్రంలో నటించింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా బాలయ్య బోపాటి చిత్ర షూటింగ్ వాయిదా పడింది.