మెగాబ్రదర్ నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తోన్న 'అదిరింది' కామెడీ షో నుండి యాంకర్ సమీరా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీని తీసుకొచ్చారు. మరో యాంకర్ గా రవి కూడా వచ్చి చేరాడు. వారితో షూట్ చూసిన ప్రోమోని కూడా ఇటీవల రిలీజ్ చేశారు.

అయితే సమీరా ఈ షో నుండి తప్పుకున్న దానిపై సోషల్ మీడియాలో చాలానే రూమర్లు వచ్చాయి. ఆమె గర్భవతి అని కొందరు, పది ఎపిసోడ్ల వరకే ఒప్పందం కుదుర్చుకున్నారని ఇలా చాలానే వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది యాంకర్ సమీరా.

యాంకర్ ని మార్చేసిన నాగబాబు.. 'అదిరింది' షోకి బిగ్ బాస్ భామ

చాలా మంది తనకు ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నారని.. తనంతట తాను షో నుండి తప్పుకోలేదని.. ప్రొడక్షన్ టీమ్ తీసుకున్న నిర్ణయమని అన్నారు. తనకు ఈ విషయం కూడా మీడియా ద్వారానే తెలిసిందని చెప్పారు. ఎప్పటినుండో యాంకర్ ని మార్చాలని అనుకుంటున్నారని.. సరైన సమయం అనుకొని తన స్థానంలో మరొకరిని తీసుకొచ్చారని అన్నారు.

తనను మార్చడానికి గల కారణాలను కూడా షో యూనిట్ చెప్పలేదని అన్నారు. బహుశా వారికి ఇంకా గ్లామరస్ గా కనిపించే యాంకర్ కావాలేమోనని అన్నారు. తను ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు. అలానే తను కేవలం పది ఎపిసోడ్లకే ఒప్పుకున్నానని వినిపిస్తోన్న ఊహాగానాల్లో కూడా నిజం లేదని.. తాను 26 ఎపిసోడ్లకు కాంట్రాక్ట్ సైన్ చేసినట్లు చెప్పారు. షోని కొత్తగా హోస్ట్ చేయబోతున్న రవి, భానుశ్రీలకు శుభాకాంక్షలు చెప్పారు.   


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Here’s the real reason behind it. Talking about the rumours.

A post shared by Sameera Sherief (@sameerasherief) on Feb 28, 2020 at 4:40am PST