ప్రస్తుతం సౌత్ లో ఉన్న అద్భుతమైన నటీమణుల్లో సమంత ఒకరు. కేవలం గ్లామర్ తో మాత్రమే కాదు.. నటనతో కూడా సమంత తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. గత కొన్నేళ్లుగా సమంత నటిస్తున్న చిత్రాలు గమనిస్తే ఆమె ప్రతితిభ ఏంటో అర్థం అవుతుంది. రంగస్థలం, మహానటి. ఓ బేబీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో సమంత నటించింది. 

అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత కూడా సమంత జోరు తగ్గలేదు. ఈ ఏడాది సమంత జాను అనే చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. ఇటీవల సమంత మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతి, సమంత కాంబోలో 'కాత్తు వాక్కుల రెండు కాదల్' అనే చిత్రానికి ప్రకటన వచ్చింది. 

తాజాగా ఈ చిత్రం నుంచి సమంత తప్పుకుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైతు, సమంత వివాహం జరిగి దాదాపు రెండేళ్లకు పైగా అయింది. ఈనేపథ్యంలో చైతు, సమంత ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నారని.. త్వరలో సామ్ తల్లి కాబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అందుకోసమే సామ్ ఈ మూవీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సమంత తల్లి కాబోతున్న వార్తల్లో ఎంత వరకు వాస్తవం ఉందో వేచి చూడాలి. 

నితిన్ పెళ్లిపై ఎఫెక్ట్ పడిందా .. కరోనా దెబ్బతో ఏం చేయబోతున్నారంటే ?

కానీ చిత్ర యూనిట్ మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదు. మొత్తగా సమంత ఇటీవల కొంత కాలంగా సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తోంది. నటనకు ప్రాధ్యానత ఉన్న చిత్రాలని మాత్రమే ఎంచుకుంటోంది.