ఎన్టీఆర్ ని వెండితెరపై చూడాలనుకునే అభిమానులకు మరికొంతకాలం నిరీక్షణ తప్పదు. ఎన్టీఆర్ చివరగా నటించిన అరవింద సమేత చిత్రం 2018లో విడుదలయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి కమిటయ్యారు. దీనితో ఎన్టీఆర్ కెరీర్ లో 2019 ఖాళీగా మిగిలిపోయింది. 

ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో 2020 కూడా ఎన్టీఆర్ కెరీర్ లో ఖాళీనే. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ చిత్రం 2021లో కూడా విడుదలయ్యే అవకాశాలు లేవనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శత్వంలో మరోసారి నటించబోతున్నాడు. 

అలాంటి పాత్రల కంటే ఐటెం సాంగ్స్ చేయడమే బెటర్.. అవి నాకు నచ్చలేదు

హారిక అండ్ హాసిని సంస్థ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ చిత్రకోసం నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లకు ఆస్కారం ఉన్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ ని త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 

మెయిన్ హీరోయిన్ గా త్రివిక్రమ్ సమంతని ఎంపిక చేశారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే సమంత, ఎన్టీఆర్ కలసి ఐదోసారి రొమాన్స్ చేయబోతున్నట్లు అవుతుంది. అలాగే సమంతకు త్రివిక్రమ్ దర్శత్వంలో ఇది నాలుగో చిత్రం అవుతుంది.గతంలో ఎన్టీఆర్, సమంత కలసి బృందావనం, రమయ్యావస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించారు.