నటి హంసా నందిని హీరోయిన్ కావాలనే కోరికతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలో హంసా నందిని హీరోయిన్ గా నటించింది. కానీ ఆ తర్వాత హంసా నందిని ఐటెం సాంగ్స్ పై దృష్టి పెట్టింది. అందచందాలు ఆరబోస్తూ తక్కువ సమయంలోనే హంసా నందిని ఐటెం బ్యూటీగా క్రేజ్ చేసుకుంది. 

హంసా నందిని ఇప్పటి వరకు మిర్చి, భాయ్, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం హంసా నందిని నటిగా గుర్తింపు తెచ్చుకోవడం కంటే ఐటెం సాంగ్స్ చేయడంపైనే ఆసక్తి చూపుతోంది. 

12 ఏళ్ల క్రితం అలా మెరిసి మాయమైంది.. ఇప్పుడు ఏ డ్రెస్ వేసినా ఎక్స్ పోజింగే!

దీనికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో హంసా నందిని వివరించింది. తనకు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలే వస్తున్నాయని హంసా తెలిపింది. కొన్ని చిత్రాల్లో ఆఫర్ చేస్తున్న పాత్రలు నాకు నచ్చడం లేదు. 

అలాంటి పాత్రల కోసం ఎదురుచూడడం, ఇష్టం లేక చేయనని చెప్పడం కంటే.. ఐటెం సాంగ్స్ చేయడం ఉత్తమం అనిపించింది. ఐటెం సాంగ్స్ ఒక్కో చిత్రంలో ఒక్కోలా వైవిధ్యంగా ఉంటాయి. పైగా పాటలు, డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందువల్లే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నట్లు హంసా నందిని తెలిపింది.