సౌత్ లో ఉన్న అద్భుతమైన నటీమణుల్లో సమంత ఒకరు. ఏ మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. కేవలం సమంత నటన ఆధారంగా బాక్సాఫీస్ వద్ద రాణించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా సమంత వివాహం తర్వాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. 

సమంత చివరగా నటించిన చిత్రం జాను. తమిళంలో విజయం సాధించిన 96 చిత్రానికి రీమేక్ ఇది. శార్వానంద్, సమంత జంటగా నటించిన జాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ చిత్ర రిజల్ట్ పై సమంతని బ్లేమ్ చేసే విధంగా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ సమంతని ఫ్లాప్ హీరోయిన్ గా అభివర్ణించింది. 

విడాకుల తర్వాత మళ్ళీ ప్రేమలో.. అమలాపాల్ కొత్త ప్రియుడు ఇతడేనా ?

ఈ కామెంట్స్ పై సమంత తాజాగా స్పందించింది. సార్ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమలో, అభిమానుల్లో విచిత్రమైన ధోరణి ఉంది. స్టార్ హీరో సినిమా వరుసగా మూడు ఫ్లాప్ అయినా ఆ హీరోని చూడడానికి ఆడియన్ నాలుగో చిత్రానికి కూడా వెళతారు. తమ అభిమాన హీరో వెండితెరపై నడిచినా చాలు అని అనుకుంటారు. 

కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్లని నిందిస్తారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా సరైన ఆదరణ లేదు. ఓ బేబీ చిత్రం విజయం సాధించప్పటికీ నేను మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి అంగీకరించలేదు. కారణం ఇదే.. ప్రేక్షకులు హీరోయిన్లని ఆదరించరు. అలాగే హీరోలకు సమానంగా పేమెంట్ కూడా ఉండదు అని సమంత ఘాటుగా స్పందించింది.