స్టార్ హీరోయిన్ సమంత పూర్తిగా సౌత్ లోనే సెటిల్ అయ్యేటట్లు కనపడుతోంది. హిందీ నుంచి వచ్చే ఆఫర్స్ ని వద్దనుకుంటోంది. ఆమెకు ఇప్పటికే చాలా ఆఫర్స్ వచ్చాయి. అయినా వేటీమీదా ఆమె ఆసక్తి చూపించలేదు. హిందీలో సినిమాలు ఆలస్యం అవటం, పోటీ ఎక్కువగా ఉండటం, ఐడెంటిటీ రావటానికి చాలా సమయం పట్టడం, మళ్లీ అక్కడ కెరీర్ ప్రారంభ రోజుల్లోకి వెళ్లాల్సి రావటం వంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ సౌత్ లో రాణి గా వెలుగుతున్న తనకు అక్కడ ఆ సిట్యువేషన్ ఎదుర్కోవటం అవసరమా అనుకుని రిజెక్ట్ చేస్తోంది. తాజాగా ఆమె ఓ మంచి ఆఫర్ ని రిజెక్టు చేస్తే తాప్సీ అందిపుచ్చుకున్నట్లు సమాచారం.

సమంత రిజెక్టు చేసిన ప్రాజెక్టు ఏమిటీ అంటే...గతంలో ఆమె నటించిన యుటర్న్ చిత్రం రైట్స్ ని ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్ద చేజిక్కించుకుని హిందీలో తీయటానికి సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా తెలుగు,తమిళంలో ఆల్రెడీ చేసిన సమంత అయితే ఫెరఫార్మెన్స్ వైజ్ బాగుంటుందని భావించారు. అందుకోసం ఆమెను సంప్రదించారు. అయితే సమంతకు హిందీ లో ఎంట్రీ ఇవ్వటం ఇష్టం లేదు..అంతేకాదు చేసిన రీమేక్ లో మళ్లీ ఏం చేస్తామనే ఆలోచన ఉంది.

ప్రేమ పెళ్లి.. ఏడాది తిరగకుండానే.. హీరోయిన్ విడాకులు

దాంతో ఆమె వెంటనే నో చెప్పేసింది. అదే సమయంలో విభిన్నమైన కథాంశాలతో హిందీలో తనదైన ముద్ర వేసిన తాప్సీ ఈ ఆఫర్ ని అందిపుచ్చుకున్నట్లు సమాచారం. దర్శకుడుగా కన్నడ వెర్షన్ డైరక్ట్ చేసిన పవన్  కుమార్ నే ఎంచుకున్నట్లు సమాచారం. ఏక్తా కపూర్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది.

చిత్రం కథ విషయానికి వస్తే...ఓ ఫ్లైఓవర్ పై జరిగే చావుల నేపథ్యంలో కథను రాసుకుని దాని ద్వారా సామాజిక సందేశం కలిపి ఇచ్చారు. అదే సమయంలో ఈ సినిమాలో ఆత్మలు వంటి అంశాలు కూడా ఉంటాయి.   ఫ్లైఓవర్ పై  యూటర్న్ తీసుకున్నవారు చనిపోవడం వెనకున్న అసలు రహస్యాన్ని కనిపెట్టి, సొల్యుషన్ ఇచ్చే దిశగా కథ నడుస్తుంది.  ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆసక్తికరంగా సాగటం సినిమాకు కలిసొచ్చింది. కన్నడంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం తెలుగుకు వచ్చేసరికి వర్కవుట్ కాలేదు.