బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి నటించిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'కి ప్రేక్షకాదరణ దక్కింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి జాతీయా దర్యాప్తు సంస్థకి ఏజెంట్ గా పని చేశాడు. సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఊహించని విధంగా భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇందులో ప్రియమణి, నీరజ్ మాధవ్, పవన్ చోప్రా, కిషోర్ కుమార్ కీలకపత్రాలు పోషించారు. ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా రెండో సీజన్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు గురువారం నుండి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలైంది.

మరో మహిళతో ఎఫైర్.. భార్యని టార్చర్ చేసిన సింగర్!

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్నట్లు దర్శకుడు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే వెల్లడించారు. ఇందులో సమంత రోల్ చాలా కీలకంగా ఉంటుందని వారు తెలిపారు. చాలా రోజులుగా సమంత ఈ సిరీస్ లో నటించనుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు రెండు, మూడు నెలలుగా మీడియాలో ఈ వార్తలు వస్తున్నాయి.

ఈ సిరీస్ షూటింగ్ కోసమే ఇటీవల జరిగిన ఏఎన్నార్ అవార్డ్స్ కి కూడా హాజరు కాలేకపోయింది సమంత. తాజాగా ఈ విషయాన్ని సమంతఅఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఫైనల్ గా తను నటించబోతున్న వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాననిచెప్పింది. ఓ డ్రీమ్ రోల్ ని తనకు ఇచ్చినందుకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు 
చెప్పింది. మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ప్రసారం కానుంది.