సమయం దొరికినప్పుడల్లా నటి సమంత.. తన భర్త నాగచైతన్యతో కలిసి గోవాకి చెక్కేస్తూంటుంది. తమకి సంబంధించిన ప్రతీ వేడుకను ఈ జంట గోవాలోనే జరుపుకుంటూ ఉంటారు. వీరిద్దరి పెళ్లి కూడా గోవాలోనే జరిగింది. ఆ తరవాత తొలి పెళ్లిరోజును కూడా గోవాలోనే జరుపుకున్నారు.

నాగచైతన్య పుట్టినరోజు సెలబ్రేషన్స్, న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఇలా అన్ని వేడుకలను గోవాలోనే జరుపుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి ఈ జంట గోవాకి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో గోవాలో ఏ వేడుక జరుపుకున్నా సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫొటోలను అభిమానులతో పంచుకుంది. కానీ ఈసారి తన గోవా విజిట్ ని సీక్రెట్ గా ఉంచింది.

'పండగపూట ఏమిటీ దరిద్రం...' సమంత డ్రెస్ పై ఘోరంగా ట్రోల్స్!

దానికొక కారణం ఉందని తెలుస్తోంది. సమంతకి గోవా అంటే చాలా ఇష్టమట.. అక్కడే బీచ్ దగ్గర ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తుందట. షారుఖ్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ ల మాదిరి సముద్ర తీరానికి దగ్గరగా గోవాలో ఓ ల్యాండ్ ని సొంతం చేసుకుందట సమంత. ఇప్పుడు ఆ స్థలంలో అన్ని సౌకర్యాలతో కూడిన విల్లాను నిర్మించాలని ప్లాన్ చేస్తుంది.

కన్స్ట్రక్షన్ కి సంబంధించిన పనులు చూడడానికే తన భర్తతో కలిసి గోవాకి వెళ్లిందని టాక్. సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత గోవాకే వెళ్లి ఉండిపోవాలనే ఆలోచన సమంతకి ఉందని చెబుతున్నారు.

మరి గోవాలో తన కొత్తిల్లు విషయాన్ని సమంత బయటపెడుతుందో లేదో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న 'లవ్ స్టోరీ' సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఇక సమంత నటించిన '96' సినిమా రీమేక్ 'జాను' విడుదలకు సిద్ధమవుతోంది.