అక్కినేని యువ వారసుడు అఖిల్ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. అఖిల్ నటించిన తొలి మూడు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. దీనితో అఖిల్ తొలి సక్సెస్ వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈ మూవీపై అఖిల్ బోలెడు ఆశలే పెట్టుకుని ఉన్నాడు. అఖిల్ నటిస్తున్న ఈ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇదిలా ఉండగా అఖిల్ బుధవారం రోజు తన 26వ జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. 

'O'తో టైటిల్ మొదలు పెట్టి దారుణంగా దెబ్బైపోయిన టాలీవుడ్ హీరోలు

కానీ చైతు, సమంత అఖిల్ ని విష్ చేయకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే సమంతపై రోజుకొక పుకారు పుట్టుకొస్తుంది. ఇలాంటి సమయంలో అఖిల్ బర్త్  రోజు చైతు, సామ్ ట్వీట్ చేయకపోవడం ఊహాగానాలు తావిస్తోంది. అక్కినేని కుటుంబంలో ఏం జరుగుతోంది అంటూ చర్చ మొదలైంది. 

అక్కినేని ఫ్యాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో విష్ చేయనంత మాత్రాన ఏమైపోయింది.. ఫోన్ ద్వారా చెప్పి ఉండొచ్చు కదా అని అంటున్నారు.