సమంత, నాగచైతన్యలు ఎనిమిదేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. స‌మంత.. అక్కినేని ఇంటికి కోడలైనప్పటికీ గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించకుండా సినిమాలు చేసుకుంటూ పోతోంది. భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటోంది. అయితే పెళ్లై మూడేళ్లు అవుతున్నా ఈ జంట  ఇంకా పిల్లల గురించి ఆలోచించలేదు. ఈ విషయమై మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.

బాలీవుడ్ కి ధీటుగా మన మల్టీస్టారర్ సినిమాలు.. బాక్స్ ఆఫీస్ బద్దలే

ఎన్నో సార్లు ఆమె గర్బవతి అంటూ వార్తలు వచ్చాయి.అంతేకాదు ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో ఈ టాపిక్ మీద సమంతపై ప్రశ్నల వర్షం కురిసింది. తాజాగా తన సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో మాట్లాడుతూంటేనూ ఇదే ప్రశ్న మరోసారి ఎదురైంది.  ఓ నెటిజన్ సమంతను  మీరు ఎప్పుడు తల్లి కాబోతున్నారని ప్రశ్నించాడు. దానికి ఆమె రిప్లై ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఏమిటా రిప్లై...
 
సమంత ప్రస్తుతం ఫ్యామిలీ మెన్ అంటూ అమెజాన్ ప్రైమ్ లో వచ్చే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆ షూటింగ్ పూర్తి చేసుకుని, హైదరాబాద్ కి వస్తున్న టైంలో కొంత లీజర్ దొరకడంతో.. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన  ఫ్యాన్స్ తో చాటింగ్ చేసింది. చాలామంది అభిమానులు రకరకాల ప్రశ్నలు వేశారు.  అందులో భాగంగానే ఒక ఫాలోవర్ ... తల్లి ఎప్పుడు కాబోతున్నావు అని అడిగాడు.  

"నా బాడీ ఫంక్షనింగ్ గురించి తెలుసుకోవాలని తెగ ఇంట్రస్ట్ చూపుతున్నవారికి నేను చెప్పేదేంటంటే.. నేను ఓ బేబీకి జన్మనివ్వబోతున్నా. డెలివరీ డేట్.. ఆగస్టు 7న 7 గంటలకి, 2022." అంటూ పోస్ట్ చేసింది. అది మేటర్. తన ప్రెగ్నన్సీ గురించి అడుగుతున్న వారికి ఇలా వ్యంగ్యంగా  సమాధానమిచ్చింది సమంత.  అలాగే ఈ వీడియోను స‌మంత తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది.  

సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ హిట్ సినిమా ’96’ రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. తమిళ వర్షెన్‌ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వర్షెన్‌ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తైంది.