బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి ఇటీవల వచ్చిన దబాంగ్ 3 సినిమా ఊహించని ఫలితాన్ని అందుకుంది. సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందుకోకపోయినప్పటికి పెట్టిన పెట్టుబడిని అయితే వెనక్కి తెచ్చేసింది. అయితే సినిమాలో విలన్ గా నటించిన కన్నడ స్టార్ హీరో సుదీప్ కి సల్మాన్ అత్యంత ఖరీదైన కారుని బహుమతిగా ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయాన్నీ సుదీప్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. అసలైతే దబాంగ్ 3 లో విలన్ గా నటించడానికి సుదీప్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. దానికి బదులుగా సుదీప్ కి మంచి గిఫ్ట్ ఇవ్వాలని సల్మాన్ ఖాన్ తన సోదరుడు సోహైల్ ఖాన్ కలిసి రెండు కోట్ల విలువైన  BMW M5 కారును సుదీప్ కి బహుమతిగా ఇచ్చారు.

స్పెషల్ గా ఇంటివరకు తెచ్చి రాత్రి సుదీప్ కి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మనం మంచిగా ఉంటె ఏ పని చేసినా మనకు మంచే జరుగుతుందని సల్మాన్ తనకు ఒక మంచి మాట కూడా చెప్పారని సుదీప్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. ఇక అభిమానులు కూడా ఈ స్టార్ హీరో ఇచ్చిన గిఫ్ట్ కి ఫిదా అవుతున్నారు. సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ సల్మాన్ చేసిన మంచి పనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

'అల వైకుంఠపురములో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!