స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్‌లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.

కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా.. ఇదేం క్రేజ్ బాబోయ్!

అయితే అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు ట్విటర్ లో హల్చల్ చేస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ లో త్రివిక్రమ్ మార్క్ ఎలివేషన్ సీన్స్, అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజన్స్, డాన్స్ అధ్బుతంగా ఉన్నాయని.. ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకి హైలైట్ గా నిలిచిందని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో హైలైట్ అని ట్వీట్స్ లో రాసుకొచ్చారు. సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్ మాస్ సీన్స్ బి,సి ఆడియన్స్ ని కట్టిపడేస్తాయని చెబుతున్నారు.

త్రివిక్రమ్ డైలాగులు ఓ రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. క్లైమాక్స్ కూడా మెప్పిస్తుందని టాక్. నవదీప్, రాహుల్ రామకృష్ణ కామెడీ సీన్లు సినిమాకి ప్లస్ అయ్యాయని అంటున్నారు. సంక్రాంతికి పెర్ఫెక్ట్ సినిమా అని చెబుతున్నారు.