సౌత్ సినిమాలు చాలా వరకు నార్త్ లో కూడా క్లిక్కవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోల డబ్బింగ్ సినిమాలు యూ ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో వెండితెరపై డైరెక్ట్ గా రిలీజయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక బాలీవుడ్ హీరోలు కూడా డబ్బింగ్ సినిమాలతో అదే తరహాలో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు.  

దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్నప్పటికీ డబ్బింగ్ సినిమాలతో మరింత మార్కెట్ పెంచుకోవాలని కొన్ని సినిమాలను అనువాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు./ సల్మాన్ ఖాన్ చాలా రోజుల తరువాత దబాంగ్ 3 అనే సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై బాలీవుడ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. దబాంగ్ సిరీస్ లు హైదరాబాద్ ఏరియాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టాయి.

ఇక తెలుగు ఆడియెన్స్ ని పూర్తిగా తనవైపుకు తిప్పుకునేందుకు ప్రభుదేవాతో కలిసి సినిమాకు ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. నేడు తెలుగు ఆడియెన్స్ తో డైరెక్ట్ గా చాట్ చేయడానికి సిద్దమయ్యాడు. ప్రభుదేవా అంటే తెలుగు ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు. గతంలో అతను డైరెక్ట్ చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. అలాగే పౌర్ణమి సినిమా చేశాడు.  

నటుడిగా కూడా తెలుగు ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా ఇప్పుడు తను డైరెక్ట్ చేసిన దబాంగ్ 3 ని తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. ఈగ విలన్ సుదీప్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటించాడు.

also read: సల్మాన్ జెట్ స్పీడ్ .. ఫ్యాన్స్ కోసం తప్పట్లేదు!

నార్త్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికె అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ప్రమోషన్స్ తో సినిమా స్థాయిని మరింత పెంచలని సల్మాన్ ఖాన్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మరి అతని ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. దబాంగ్ 3 క్రిస్మస్ కానుకగా హిందీతో పాటు తమిళ్ తెలుగులో భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.