బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక సినిమా మొదలు పెట్టాడు అంటే దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాడు. చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయడానికి ఎంత కష్టమైనా అనుభవిస్తాడు. ఇక కొన్నిసార్లు కమిట్మెంట్స్ కి లోబడి సినిమాలు మిస్ చేస్తే తన అభిమానులు నీరాశచెందకుండా ఎదో ఒక ఎనౌన్న్మెంట్ తో కిక్కిస్తాడు. ప్రతి ఏడాది సల్మాన్ ఈద్ కానుకగా ఒక సినిమాను రిలీజ్ చేస్తుంటాడు.  

ఎవరు వచ్చినా రాకపోయినా సల్మాన్ మాత్రం ఎదో ఒక సినిమాతో ఆ సమయానికి వస్తాడు అనేది అందరి మైండ్ లో ఫిక్సయిపోయింది. అయితే మంచి సినిమాతో రావాలంటే ఏడాది సమయం తీసుకునే సల్మాన్ ఖాన్ ఈ సారి ఆరు నెలలనే టార్గెట్ గా పెట్టుకున్నాడు. వచ్చే ఈద్ కి తప్పకుండా సినిమాను రిలీజ్ చేస్తానని ఎనౌన్స్మెంట్ ఇచ్చాడు. అయితే దబాంగ్ 3 ని ఇప్పటికే ఫినిషింగ్ టచ్ ఇచ్చిన భాయ్ ఆ సినిమాను క్రిస్మస్ కి రిలీజ్ చేస్తున్నాడు.  

ఇక ఈద్ కి రాధే అనే సినిమాతో రానున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అది కూడా ప్రభుదేవా డైరెక్ట్ చేయబోతున్నాడు. మొదట వీరి కాంబినేషన్ లో వచ్చిన వాంటెడ్ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు దబాంగ్ 3 తో రెడీ అవుతున్నారు. అనంతరం 2020 ఈద్ కి రాధే సినిమాతో రావాలని ఫిక్స్ అయ్యారు.

డిసెంబర్ లో దబాంగ్ 3 రిలీజ్ అనంతరం ఆ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయనున్నారు. అంటే 5నెలల్లో సినిమాను పూర్తి చేయాలనీ టార్గెట్ గా పెట్టుకున్నారు. అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఈద్ ని మిస్ చేసుకోకూడదని సల్మాన్ గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాడు. మరి ఆ సినిమాతో సల్మాన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.