సల్మాన్ ఖాన్ కు ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే ప్రేమ పావురాలు, ప్రేమాలయం తర్వాత వచ్చిన సల్మాన్ ఖాన్ డబ్బింగ్ సినిమాలు ఏవీ తెలుగులో ఆడలేదు. అయినా ఈ సారి సౌత్ ని టార్గెట్ చేస్తూ సౌత్ ఫార్మెట్ లో ఇక్కడ దర్శకుడు దర్శకత్వంలో సినిమా చేసి మళ్లీ గెలవాలనుకుంటున్నాడు.

 చుల్‌బుల్‌ పాండేగా ‘దబాంగ్‌’, ‘దబాంగ్‌ 2’ చిత్రాల్లో అలరించిన సల్మాన్ ఖాన్, ‘దబాంగ్‌ 3’తో డిసెంబర్‌ 20న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ ని విడుదల చేశారు. ఇప్పటికే హిందీ ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు ట్రైలర్ కూడా పంచ్ డైలాగ్స్ తో అదరకొడుతోంది.

దబాంగ్3 ట్రైలర్: కండల వీరుడితో కిచ్చా సుదీప్ ఢీ.. యంగ్ సల్మాన్ లవర్ గా ఆమె!

సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ...‘‘సౌతిండియన్‌ సినిమా ఫార్మాట్‌లో ‘దబాంగ్‌ 3’ ఉంటుంది. కథ, యాక్షన్‌, డ్యాన్సులు, కామెడీ, ప్రేమ సన్నివేశాలు... అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఇంతకుముందు నేను తెలుగు సినిమాలను హిందీలో రీమేక్‌ చేశా. ఇప్పుడు టీవీలో తెలుగు సినిమాల డబ్బింగ్‌ వెర్షన్లు టెలికాస్ట్‌ చేస్తున్నారు. అందువల్ల, రీమేక్‌ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా’’ అన్నారు.

మొదటి రెండు పార్టుల్లో స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టించిన సోనాక్షి సిన్హానే ఈ చిత్రంలోనూ స‌ల్మాన్ భార్య‌గా న‌టించారు. అయితే స‌ల్మాన్ ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రం ఓ ల‌వ్‌స్టోరీ ఉన్న‌ట్లు ట్రైల‌ర్ చూపించారు. ఈ ట్రైల‌ర్‌లో మ‌హేశ్ మంజ్రేక‌ర్ త‌న‌య స‌యీ మంజ్రేక‌ర్ లవర్ గా న‌టించింది. మొదటి రెండు భాగాల్లో స‌ల్మాన్ తండ్రిగా న‌టించిన వినోద్ ఖ‌న్నా క‌న్నుమూయ‌డంతో ఆయ‌న స్థానంలో ప్ర‌మోద్ ఖ‌న్నా న‌టించారు. డింపుల్ క‌పాడియా స‌ల్మాన్ త‌ల్లిగా న‌టించారు. ద‌బంగ్‌లో సోనూసూద్‌, ద‌బంగ్ 2లో ప్రకాశ్ రాజ్ విల‌న్స్‌గా న‌టించ‌గా ద‌బంగ్ 3లో క‌న్న‌డ స్టార కిచ్చా సుదీప్ విల‌న్‌గా న‌టించారు.